మన్యంలో మరోసారి అలజడి!

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా ఎన్ కౌంటర్ పై ఏవోబి స్పెషల్ జోన్ కమిటీ జగబంధు పేరిట విడుదలైన మావోయిస్టులు లేఖ విశాఖ మన్యం లో మరోసారి అలజడి రేపు తోంది. ఈ అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు విజయ్ కూడా లేటరైట్ పేరిట క్వారీలు తవ్వకాలకు పాల్పడుతున్నారని వారి పద్దతి మార్చుకోవాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.

మైనింగ్ మాఫియాగా మారి ఆదివాసీ సంపదలను అప్పనంగా కొల్లగొడుతున్నందుకే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా లను హతమార్చామని ఏఓబి జోనల్ కమిటీ వెల్లడించింది.

ఏవోబి సరిహద్దు ప్రాంతంలో తూర్పు కనుమలు బాక్సైట్ వెలికితీసే ప్రయత్నంలో గత కొన్ని దశాబ్దాలుగా పాలక పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, కేంద్రంలో పాలన సాగించిన గత యూపీఏ ప్రభుత్వం, నేటి ఎన్డీయే ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో అధికారం చలాయించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏదీ దీనికి మినహాయింపు కాదన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మారుస్తునే ఉన్నారని, కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమా ఇద్దరు ఆదివాసీ నేతలు కాదు. ప్రజా ద్రోహులుగా అభివర్ణించారు.సామ్రాజ్య వాద బహుళ జాతి కంపెనీలకు దళారీలు, నమ్మకబంట్లు, ప్రజా వ్యతిరేకులని లేఖలో మండిపడ్డారు.

బాక్సైట్ తవ్వకాల కోసం జిందాల్, రస్ ఆల్ ఖైమా, ఆన్ రాక్ లకు ఏజెంట్లుగా మారి అపారమైన డబ్బును స్వాహా చేశారని ఇదే బాటలో నడుస్తున్న మైనింగ్ మాఫియాకు కూడా హెచ్చరిస్తున్నాం అన్నారు.బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 97 పూర్తిగా రద్దు చేయాలని,ఆదివాసీ అటవీ సంపదలను అక్రమంగా దోచుకునే కార్యక్రమాలను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు.

Total Views: 54 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ