మా బాలయ్య బాబునే మరిచిపోతారా!!

మంచు మనోజ్ తెరపైనే కాదు.. తెర వెనుక కూడా చాలా సరదాగా అందరినీ ఆట పట్టిస్తుంటారు. గతంలో ఓ సారి స్టేజి పైనే కమెడియన్ ధన్‌రాజ్‌ను దాదాపు కొట్టేసేంత కోపం నటించి అందర్నీ కాసేపు హడలగొట్టేశాడు. ప్రస్తుతం తాను నటించిన ‘గుంటూరోడు’ సినిమా మార్చి 3న థియేటర్లలోకి రానుండటంతో మనోజ్ ప్రచారంలో బిజీ అయిపోయారు. ప్రమోషన్‌లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మనోజ్‌కి ఓ సినిమా ప్రశ్న ఎదురైంది.

ఓ ఫిల్మ్ మీడియా సంస్థ ఆధ్వరంలో మనోజ్ ఈ ప్రశ్న- సమాధానం కార్యక్రమంలో పాల్గొన్నారు. సదరు యాంకర్ గుంటూరు నేపథ్యంలో వచ్చిన రెండు సినిమా పేర్లు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. దీనికి మనోజ్ ‘గుంటూరు టాకీస్’ ఒక పేరు చెప్పి.. రెండో పేరు చెప్పేందుకు సిద్ధమవుతుండగా యాంకర్ తనకి కూడా సరిగా గుర్తులేనట్లు తడబడింది. వెంటనే అందుకున్న మనోజ్ మా బాలయ్య బాబు సినిమా పేరునే మరిచిపోతారా మీరు..? అంటూ కాసేపు చిరుకోపం నటించి ‘పలనాటి బ్రహ్మనాయుడు’ అని గుర్తు చేసుకున్నారు. గుంటూరోడులో ప్రగ్యా జైస్వాల్‌తో తొలిసారి నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చిన మనోజ్.. సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాలని అభిమానులకి సూచించారు.

Total Views: 27621 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు