కరక్కాయ గ్యాంగ్ దొరికేసింది!

రెండు తెలుగు రాష్ట్రాల లోని ఎన్నో కుటుంబాలలో పెద్ద అలజడి సృష్టించిన కరక్కాయ కేసు ఒక కొలిక్కి వచ్చింది.కరక్కాయల కేసులో ప్రధాన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కేంద్రంగా కరక్కాయలను పొడిగా చేసి ఇస్తే … నగదు ఇస్తామంటూ కొందరు కేటుగాళ్లు.. పలువురికి పెద్ద ఎత్తున కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. కేజీ కరక్కాయలను తీసుకెళ్లి పొడిచేసి ఇస్తే.. వెయ్యికి మూడు వందలు లాభం ఇస్తామని చెప్పి.. లక్షల్లో వసూలు చేశారు.

ఆ తర్వాత బిచాణా ఎత్తేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లికార్జున్‌తో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్… ఇవాళ సాయంత్రం కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు.

Total Views: 139 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మానవ మృగాలు:ఒకవైపు మామయ్య.. మరోవైపు పిన్ని కొడుకు!

మనుషుల రూపంలో మానవ మృగాలు జనారణ్యంలో తిరుగుతున్నాయి. మంచి తనం