మీరైనా పవన్ కి చెప్పండి : మహేశ్ సోదరి

మహేశ్ సోదరి మంజుల దర్శకత్వంలో ‘మనసుకు నచ్చింది’ సినిమా రూపొందింది. సందీప్ కిషన్ – అమైరా దస్తూర్ జంటగా ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ .. ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.ఈ సమయంలోనే ఆమె పవన్ గురించి ప్రస్తావించారు. “మా నాన్నగారు .. మహేశ్ తరువాత నేను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనలోని నిజాయితి నాకు బాగా నచ్చుతుంది. ఆయన కోసం నేను ఒక కథ రాసుకున్నాను .. ఆ కథకి ‘పవన్’ అనే టైటిల్ ను కూడా పెట్టేశాను. నేను రాసిన కథ పవన్ వినాలే గానీ, ఆయనకి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. ఒకసారి ఈ కథ వినమని మీరైనా చెప్పండి” అంటూ ఆమె మీడియా మిత్రులను కోరడం విశేషం.  

Total Views: 186 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఎన్టీఆర్ సోదరుల సాయం!

‘తితలీ’ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి