ధోనీ సంచలన నిర్ణయం

untitled-1ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ముందు కెప్టెన్ కూల్ ధోనీ షాకిచ్చాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. మిగతా ఫార్మాట్లలోనూ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. జనవరి 15 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే, టీ20 మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపాడు. ధోనీ రిటైర్మెంట్ వ్యవహారాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. మహేంద్రుడి స్థానంలో విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ట్వీటర్ ద్వారా పేర్కొంది. ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి మూడు వన్డేల కోసం సెలక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించనుంది. ఈలోగానే ధోనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 0-4 తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్‌కు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కోసం స్వదేశానికి వెళ్లింది. ఆ జట్టు జనవరి 10, 12 తేదీల్లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జనవరి 15న పుణేలో జరగనుండగా, రెండో మ్యాచ్ 19న కటక్‌లో జరగనుంది.

టెస్టుల్లో విరాట్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత విజయాలు సాధిస్తుండటంతో వన్డే, టీ20ల్లోనూ అతడినే కెప్టెన్‌‌గా నియమించాలనే డిమాండ్ ఇటీవల ఊపందుకొంది. రానున్న వరల్డ్ కప్ వరకూ ధోనీనే కెప్టెన్‌గా కొనసాగించలేకపోతే.. విరాట్‌కే కెప్టెన్సీ కట్టబెట్టాలని క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కోహ్లికి కెప్టెన్సీ ఇవ్వడం వల్ల ప్రపంచ కప్‌లో భారత విజయావకాశాలు మెరుగుపడతాయని వారు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించి ధోనీ జట్టు ప్రయోజనా దృష్ట్యా కెప్టెన్సీ గుడ్ బై చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. ధోనీ ఇప్పటి వరకూ 199 వన్డేలు, 72 టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.

Total Views: 1119 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి