మీడియా తీరుపై జేపీ సంచలన వ్యాఖ్యలు!!

ప్రస్తుత మీడియా పోకడలు సంచలనాల కోసం పరుగులు పెడుతున్న తీరుపై లోక్ సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు . సురాజ్య పాలన కోసం రాష్ట్రం అంతా తిరుగుతున్న జెపి రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా యాజమాన్యాల తీరు ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు . రేటింగ్స్ కోసం 90 శాతం వార్తలు ప్రసారం చేసినా 10 శాతం అయినా దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే వార్తలు ఇవ్వండి అంటూ చేతులెత్తి ప్రాధేయపడ్డారు . వ్యవస్థలో మార్పు కోసం అన్ని వదులుకుని వచ్చానని కానీ ఇప్పుడు నోటు కు ఓటు చూసాకా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చర్యలు తీసుకుంటే దక్షిణాదిన జైళ్లు సరిపోవని . పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు నాయకులపై చర్యలు చేపడితే దేశంలో జైళ్లు సరిపోవని పదునైన వ్యాఖ్యలు చేశారు జయప్రకాశ్ నారాయణ.ఇక నంద్యాల పార్లమెంట్ స్థానాల్లో అధికార ప్రతిపక్షాలు చేసిన డబ్బు పంపిణి కొత్తగా చూసింది కాదని అన్నారు డాక్టర్ జయప్రకాశ్ . ఆ ఎన్నికల్లో మీడియా వ్యవహారశైలిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు . అక్కడ గెలుపు ఓటముల ఫలితంతో ప్రజల భవిష్యత్తు మారిపోదని కానీ ఆ వార్తలే తప్ప ఏ వార్తలు చూపించకపోవడం దుర్మార్గం అన్నారు . 

Total Views: 223 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..