విజయవాడ వైసీపీ అభ్యర్థులు వీరే..!

ఏపీలో రాజకీయాలకు పుట్టినిల్లు అని భావించే న‌గ‌రం బెజవాడ. అలాంటి బెజవాడ లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా యి. తూర్పు, ప‌శ్చిమ, సెంట్ర‌ల్‌, నియోజ‌క‌వ‌ర్గాలు. ఒక్క ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా.. మిగిలిన రెండు చోట్లా క‌మ్మ, కాపు సామాజిక వ‌ర్గాల వారిదే ఆధిపత్యం. దింతో రాజకీయంగా కూడా ఆ సామాజిక వర్గ నేతలదే పై చేయి. రాజకీయ పార్టీలు కూడా వారికే పెద్ద పీట వేసి విజయ బావుటా ఎగేరేస్తూ ఉంటారు.

తూర్పు నియోజ‌కవ‌ర్గం అన‌గానే క‌మ్మల‌కు ప్రాతినిధ్యం వ‌హించేదిగా, సెంట్ర‌ల్‌లో కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం చూపించేందిగా మారిపోయింది. మూడో నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ‌లో ముస్లింలు, జైనులు, వైశ్యుల ప్ర‌భావం కూడా ఇక్క‌డ ఎక్కువే.ఇలా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌భావితం చేసే నేత‌ల‌ను జ‌గ‌న్‌ ఎంపిక చేసి టికెట్లు ఖ‌రారు చేసిన‌ట్టు వైసీపీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా తూర్పులో పాగా వేసేందుకు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన య‌ల‌మంచిలి ర‌విని ఇటీవ‌లే పార్టీలోకి తీసుకున్నారు.ఇక‌, ప‌శ్చిమ టికెట్‌ను ఇప్ప‌టికే వైశ్య వ‌ర్గానికి చెందిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. ఇక‌, వైసీపీలో భారీ ఎత్తున పోటీ వ‌చ్చిన సెంట్ర‌ల్‌లో ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసిన జ‌గ‌న్‌.. వంగ‌వీటి రాధాకు టికెట్ ఖ‌రారు చేశార‌ని చెబుతున్నారు.ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావించిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రం లో కీలకమైన విజయవాడ లో పట్టు కోసం జగన్ ఒకడుగు ముందే వేశారు అని చెప్పుకోవాలి.

 

Total Views: 789 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే