అతిలోక సుందరి అంతిమ యాత్ర!

అశేష జనవాహినిని అర్ధశతాబ్ధంపాటు అలరించి, ఎన్నెన్నో మరుపురాని పాత్రల్లో జీవించి మెప్పించిన మేటి నటి శ్రీదేవి మానవ లోకానికి సెలవంటూ సాగిపోయారు. అంతిమ యాత్ర ప్రారంభం కావడానికి ముందు శ్రీదేవి పార్థివదేహంపై జాతీయ జెండాను ఉంచి, ప్రభుత్వ లాంఛనాలతో సత్కరించారు. తనకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరలో శ్రీదేవిని అలంకరించారు. శ్రీదేవికి కాంచీవరం చీరలంటే చాలా ఇష్టమట. అందుకే ఆమె భౌతికకాయానికి బంగారు వర్ణంతో కూడిన కాంజీవరం చీరను కప్పి అంతిమయాత్ర నిర్వహించారు.

దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులెందరో శ్రీదేవి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్న వాహనాన్ని పూర్తిగా తెలుపురంగు పూలతో అలంకరించారు. శ్రీదేవికి తెలుపు రంగంటే చాలా ఇష్టమట. అందుకే అంతా తెలుపు రంగు పూలతో అలంకరించారు. ఆమె భౌతికకాయం వెంట భర్త బోనీకపూర్, అర్జున్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

Total Views: 17445 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ చేతికి మరో ఆయుధం ఇచ్చిన బాబు..!

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి…