అమ్మా ఇవ్వలే…బొమ్మా ఇవ్వలే..!: కేటీఆర్

కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ భవన్‌లో పలువురు ఆర్యవైశ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మా ఇవ్వలేదు…బొమ్మా ఇవ్వలేదని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాది మంది బలిదానాలు చేస్తే..తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ద్రోహం చేసిందని కేటీఆర్ తనదైన శైలిలో జాతీయ కాంగ్రెస్‌ను తుర్పారబట్టారు. 60 ఏండ్లకు ముందు..వజ్రంలా ఉన్న తెలంగాణను కొందరి కుట్రలకు బలి చేసి తెలంగాణ, ఆంధ్రకు అప్పట్లో బలవంతపు పెళ్లి చేసిందని ఆయన మండిపడ్డారు.ఎన్నికల కాలం వచ్చందంటే గాలి మాటలు వినిపిస్తుంటాయని… నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ..ప్రజలను మభ్యపెడతారని, అలాంటి నాయకులే మళ్లీ మీ వద్దకు వచ్చి…ఇంటింటికీ తులం బంగారం ఇస్తామని కూడా చెబుతారని… ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారింది.

Total Views: 61 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా