దయచేసి నన్నుచంపేయకండి! : కోట శ్రీ‌నివాస‌రావు

ఇది దారుణం.. బ‌తికి ఉన్న మ‌నిషిని చనిపోయారంటూ.. సోష‌ల్ మీడియాలో అడ్డ‌గోలు ప్ర‌చారం చేయ‌డం అత్యంత దారుణం. ద‌య‌నీయం. మాన‌వ‌త్వ‌పు విలువ‌లు మంట‌గ‌లిపేస్తూ దారుణాల‌కు తెగ‌బ‌డ‌డం కిందే లెక్క‌. కొన్నిసార్లు పొర‌పాటున జ‌రిగిందిలే అని క్ష‌మించేయ‌లేని త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా సెల‌బ్రిటీల విష‌యంలో ఇలాంటి దుష్ప్ర‌చారాలు మ‌రీ పెచ్చు మీరిపోతోందంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఆ క్ష‌ణం స‌ద‌రు సెల‌బ్రిటీ కుటుంబాల్లో ఎలాంటి ఆందోళ‌న‌, గంద‌ర‌గోళం నెల‌కొంటుందో అర్థం చేసుకోవాలి. బ‌తికుండ‌గానే చంపేస్తున్నారు.. ఇదేం అన్యాయం! అంటూ గోడు వెల్ల‌బోసుకోవ‌డం స‌హ‌జ‌మే.

అయితే ఇలాంటి దుష్ప్ర‌చారం ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత గాయ‌ని సుశీల విష‌యంలో జ‌రిగింది. అంత‌కుముందే గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం విష‌యంలోనూ ఇలానే చెడు ప్ర‌చారం చేశారు. ఇలాంటి తేడా ప్ర‌చారం గ‌తంలోనూ ప‌లువురు సెల‌బ్రిటీల విష‌యంలో జ‌రిగింది. ఆ క్ర‌మంలోనే బాదితులంతా మీడియా ముందుకొచ్చి మేం ఇంకా బ‌తికే ఉన్నాం అంటూ.. ఈ దారుణంపై బాధ‌ప‌డ‌డం.. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం త‌గ‌ద‌ని చెప్ప‌డం చూశాం. ఈ జాబితాలో లేటెస్ట్ గా సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు (70) చేరారు. “నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేరానంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంతా అబ‌ద్ధం. నేను బాగానే ఉన్నా. ఆరోగ్య స‌మస్య‌లేం లేవ్‌. ఇలాంటి వార్తల వల్ల నా మనసు బాధపడింది“ అంటూ విచారం వ్య‌క్తం చేశారు కోట‌. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేసేస్తారా? అంటూ ఆవేదన చెందారు. మీడియా స‌మ‌క్షంలో మాట్లాడిన ఆయ‌న బంధుమిత్రుల నుంచి ఫోన్‌లు వ‌స్తుంటే బాధ‌ప‌డ్డాన‌ని అన్నారు. ఇలాంటి దుష్ప్ర‌చారాన్ని వ్యాపారంగా చూస్తున్నార‌ని, ప్ర‌భుత్వమే ఇలాంటివాటికి ఏదో ఒక‌టి చేయాల‌ని కోరారు. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను పైగా ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాన‌ని.. వ‌య‌సు మీద‌ప‌డినా బాగానే న‌టించ‌గ‌లుగుతున్నాన‌ని తెలిపారు కోట‌.

Total Views: 582 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన