నల్గొండ నుంచే కేసీఆర్ పతనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని… ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నల్గొండ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని… ఆ ప్రభుత్వంలో తాను కీలక పదవిలో ఉంటానని తెలిపారు. నల్గొండలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించినందుకు తమ అధినేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నానని కోమటిరెడ్డి అన్నారు. తనపై ఉన్న నమ్మకంతోనే ఈ పదవిని కట్టబెట్టారని చెప్పారు. ప్రజా మేనిఫెస్టోను రూపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించి మేనిఫెస్టోను రూపొందిస్తామని అన్నారు. మహాకూటమి వల్ల సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని… గెలిచే అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు.

Total Views: 455 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ