పొగరు నా ఒంట్లో! హీరోయిజం నా ఇంట్లో!

chiru‘పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది’ అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.చిరంజీవి- కాజల్ జంటగా రానున్న మూవీ ఖైదీ నెం 150. దీనికి సంబంధించి నిమిషమున్నర నిడివిగల ట్రైలర్‌ విడుదలైంది. జైలు సీన్‌తో ప్రారంభమై..ఆ తర్వాత చిరు డ్యాన్స్, ఫైట్స్‌తో ముగిసింది. మెగాస్టార్స్ ఫ్యాన్స్‌కి ఏం కావాలో ట్రైలర్‌లో అవన్నీ కనిపించాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ మెగాస్టార్ కనిపించాడు.

ఇందులో చిరు చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ‘కష్టం వస్తదో.. కార్పొరేట్‌ సిస్టమ్‌ వస్తదో రమ్మను’.. ‘వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి’.. అంటూ చెప్పే డైలాగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Total Views: 424 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

గుండు దాని కథ!

Total Views: 32 ,