రాజభవన్ చుట్టూ కన్నడ రాజకీయ డ్రామా!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. బీజేపీ 104 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించగా.. 78 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానం లో ఉంది. ఇక జేడీఎస్ 38 స్థానాలతో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. ఏ ఒక్క పార్టీకి అధికార పీఠం పై కూర్చునే మేజిక్ ఫిగర్ రాకపోవటంతో కాంగ్రెస్, బీజేపీ లు జేడీఎస్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామి అడుగులు వేస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా జేడీఎస్ లో చీలిక తీసుకొచ్చి అధికార పీఠం పై కూర్చునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఇదంతా ఒక రాజకీయం అయితే .. అసలు రాజకీయ డ్రామా రాజభవన్ కేంద్రముగా ఇప్పుడు ప్రారంభం అయ్యింది. గవర్నర్ వాజుభాయ్ వాలా పైనే ఇప్పుడు అందరి ద్రుష్టి. ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాజభవన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే.. గవర్నర్ వాజుభాయ్ వాలా ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. 38 స్థానాలు గెలిచిన జేడీఎస్‌కు 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మద్దతివ్వడంతో పరిస్థితి తారుమారైంది. ఇప్పటికే ఒకసారి గవర్నర్‌ను కలవడానికి వెళ్తే కాంగ్రెస్, జేడీఎస్ నేతలను రాజ్‌భవన్ లోనికి రానివ్వలేదు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ కుమారస్వామి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే హార్డ్‌కోర్ ఆరెస్సెస్ వ్యక్తి, ఒకప్పుడు గుజరాత్‌లో మోదీ కోసం తన సీటునే త్యాగం చేసిన వాజుభాయ్ వాలా ఇప్పుడేం చేయబోతున్నారు? సాంప్రాదాయాన్ని ఆయన ఫాలో అయితే కనుక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా నిలిచినా.. రెండోస్థానంలోని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో గవర్నర్‌దే కీలక పాత్ర కాబోతున్నది.

Total Views: 1203 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే