కర్నటకలో మారుతున్న రాజకీయ సమీకరణలు!

అనూహ్యంగా కన్నడ రాజకీయ సమీకరణాలు మలుపులు తిరుగుతున్నాయి.. సాధారణ మెజార్టీ దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ మళ్లీ కాస్త వెనకబడింది. మ్యాజిక్ ఫిగర్‌కు సింగల్ డిజిట్ ఫిగర్ దూరంలో బీజేపీ నిలిచిపోయింది. దీంతో ఎవరో ఒకరి మద్దతు తీసుకోక తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జేడీ (ఎస్) మద్దతు తీసుకుంటుందా? లేక ఆ పార్టీని చీలుస్తుందా? అనేది చూడాలి. ఫలితాలు వెలువడుతున్నప్పుడు పూర్తి దీమాతో ఉన్న భారతీయ జనతా పార్టీ… ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై వ్యూహరచనలో మునిగిపోయింది. అయితే ఇటు కాంగ్రెస్-జేడీ(ఎస్‌) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలూ లేకపోలేదు. ఆ రెండు పార్టీలు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజార్టీ అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జేడీఎస్‌తో టచ్‌లో ఉన్నారు. మరి పరణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి. 

Total Views: 299 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే