కాపు రిజర్వేషన్ల ఇస్తే మా తడాకా చూపిస్తాం!

రిజర్వేషన్లపై జస్టిస్‌ మంజునాథ్‌ తన నివేదిక ఇవ్వలేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తాను సిఫార్సు చేయబోనని స్పష్టంచేశారని, అందుకే నివేదిక ఇవ్వలేదట. ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ల విధానంలో మార్పులు చేయాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఒక కులానికి కాకుండా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న భావనతో మంజునాథ్‌ ఉన్నారట. ఈ నేపథ్యంలో కమిషన్‌ సభ్యులు సీఎంని కలసి నివేదిక ఇవ్వడం, మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, బిల్లు తయారు చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగి పోయాయి. రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తే బీసీల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుంది కాబట్టి… మిగతా రిజర్వేషన్లు మాత్రం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక జస్టిస్‌ మంజునాథ్‌ తన నివేదిక ఇచ్చేందుకు ఎందుకు విముఖంగా ఉన్నారన్న అంశంపై మంత్రివర్గ సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వేర్వేరు సిఫార్సులతో కలిసి కమిషన్ ఒకేసారి నివేదిక ఇవ్వటం సహజం. ఈసారి మాత్రం సభ్యులు మాత్రమే నివేదిక ఇచ్చారు. దాన్నే ప్రభుత్వం ఆమోదించింది.

మరోవైపు కాపులను బీసీల్లో చేరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాపులను బీసీల్లో చేరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు.

Total Views: 690 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ