ఇజం రివ్యూ

ismపటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తరువాత విడుదలైన షేర్ సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అందుకే ఈ సారి గ్యారెంటీగా హిట్ కొట్టాలన్న కసితో సరికొత్త మేకోవర్, బాడీ లాంగ్వేజ్తో తొలిసారిగా ఓ స్టార్ డైరెక్టర్తో కలిసి పని చేశాడు. పూర జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇజం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్. అనుకున్నట్టుగా హిట్ సాధించాడా..?

కథ :

కల్యాణ్‌రామ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ స్ట్రీట్‌ ఫైటర్‌. బ్యాంకాక్‌లోని ఓ దీవిలో డబ్బుల కోసం ఫైట్‌ చేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం అన్వేషిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అలియా (అదితి ఆర్య)ని చూసి మనసు పడతాడు. ఆమె.. చీకటి సామ్రాజ్యానికి అధినేత అయిన జావేద్‌ భాయ్‌ (జగపతిబాబు) కూతురు. దేశాన్ని తన తండ్రి భయపెట్టిస్తుంటే.. తన తండ్రినే భయపెట్టించే మగాడ్ని పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. ఆ లక్షణాలు చూసే కల్యాణ్‌రామ్‌ని ప్రేమిస్తుంది. అయితే కల్యాణ్‌రామ్‌ అసలు పేరు సత్య మార్తాండ్‌ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సత్యమార్తాండ్‌ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనేది వెండితెర మీద చూడాల్సిందే.

పాత్రల తీరుతెన్నులు :

గత సినిమాల్లో కల్యాణ్‌ రామ్‌కు ఇందులో పాత్రకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో.. అలానే కనిపిస్తారు కల్యాణ్‌ రామ్‌. కోర్టు సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అదితి ఆర్యకి ఇదే తొలి సినిమా. ఆమె ఓకే. జగపతిబాబుని విలన్‌ అనుకోవడానికి వీల్లేదు. బీడీ ప్రేమికుడిగా.. కొన్ని సన్నివేశాల్లో రక్తి కట్టించాడు. అయితే డాన్‌ పాత్రపై మరింత దృష్టి పెట్టాల్సింది. గొల్లపూడి కనిపించేది ఒక్క సన్నివేశమైనా బాగుంది. అనూప్‌ బాణీల్లో మెలోడీ గీతం బాగుంది. ‘ఇజం.. ఇజం’ అంటూ పూరి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంటుంది. పూరి డైలాగుల్లో మరిన్ని మెరుపులు ఉంటే బాగుండేది. కథ విషయంలో మరికాస్త కసరత్తు చేయాల్సింది.

తన కొత్త సినిమాలను కూడా పాత పద్ధతిలో తీస్తుండటం వల్ల కొత్తదనం మిస్ అయిన ఫీలింగ్. కొన్ని సీన్లు మరీ సిల్లీగా ఉండి సినిమా వెయిట్ ను తగ్గించాయి. రొటీన్ క్యారెక్టరైజేషన్,.రొటీన్ సీస్స్ నుంచి పూరీ బయట పడితే..అతనినుంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందనేది సినీజనాల ఫీలింగ్.. కానీ ఇజం సినిమాతో మాత్రం కాస్త కొత్తగా ట్రై చేశాడు పూరీ.. క్లైమాక్స్‌లో బ్రిటీషువాళ్ళు దోచుకోవడం , స్వాతంత్ర్యం వచ్చాక మనవాళ్ళు దోపిడీని పోలుస్తూ రాసిన డైలాగ్స్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. థియేటర్‌లో విజిల్స్ మోత మోగింది. టోటల్ గా పూరీ కష్టం తెరమీద కనిపించిందనే కామెంట్స వినిపిస్తున్నాయి.
రేటింగ్: 2.5

(Satish K.S.R.K)

Total Views: 1856 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ

నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా