మాది స్నేహ బంధం మాత్రమే!! : గుత్తా జ్వాల

గోపీచంద్‌తో వ్యక్తిగతంగా తనకేమీ సమస్యలేదని.. ఆయన సమస్యేంటో తనకు తెలియదన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. గోపిచంద్‌ తనను మాత్రమే కాదు.. డబుల్ గేమ్‌ను ఎందుకు ప్రోత్సహించరో చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తులను కాకుండా గేమ్‌ను ఎంకరేజ్ చేయాలని కోరారు గుత్తాజ్వాలా. తాను దేని గురించీ ఆందోళన చెందక పోవడం వల్లే ఉల్లాసంగా కన్పిస్తానన్నారు. తాను ఎప్పుడూ గేమ్‌పై దృష్టిపెట్టకుండా లేనని తెలిపారు. తానేం వివాదాలు మాట్లాడనని… నిజాలు మాత్రమే మాట్లాడుతానంటున్నారు గుత్తా జ్వాలా. అజహారుద్దీన్ కుటుంబంతో ఉన్నది మంచి స్నేహ సంబంధం మాత్రమేనన్నారు.

తాను 16 ఏళ్లుగా ఆటలో ఎన్నో సాధించాను, మరి పద్మశ్రీ అర్హతకు ఏం కావాలో తెలీదన్నారు. ప్రతీచోట లాగే బ్యాడ్మింటన్‌లోనూ గ్రూపు రాజకీయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తనకు సినిమాల్లో నటించే ఆలోచనలేదని.. మహిళల కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలపై తనకు పూర్తిగా అవగాహనలేదని… మంచి చేయడానికి ఉపయోగపడితే రాజకీయాల్లోకి రావొచ్చేమోనని అన్నారు. చేతన్‌తో విడిపోవడానికి ఇద్దరివైపు కారణాలున్నాయన్నారు. సరైన మెచ్యూరిటీ లేకుండానే పెళ్లిచేసుకుని పొరపాటు చేశానని… సరైన వ్యక్తి దొరకగానే మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

Total Views: 7524 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే