త్వరలో మీడియా ముందుకు ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆయన తాజాగా నటించిన చిత్రం జై లవ కుశ. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు మీడియా కంటయ్యేలా చేసింది. సినిమాను ఓ పేషంట్ గా అభివర్ణిస్తూ విశ్లేషకులను దారినపోయే దానయ్యలు అంటూ సంభోదించాడు ఎన్టీఆర్. అయితే ఈ విషయంపై మీడియా చేస్తున్న రచ్చ చూసి ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడకూదడని అనుకుంటున్నారట.

అంతేనా త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్రిటిక్స్ ను అన్నందుకు సారీ కూడా చెబుతాడని అంటున్నారు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, అభిప్రాయం చెప్పడంలో స్వాతంత్రం అందరికి ఉంటుందని భావినట్టున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే స్టార్ హీరో అంటే మీడియాతో కచ్చితంగా అవసరం ఉంటుంది. సినిమా మీడియా రెండు కలిసి పనిచేయాలి. మీడియా ప్రమోషన్స్ లేనిదే ఎలాంటి సినిమా వర్క్ అవుట్ అవదు. సినిమా విషయంలో తాను మాట్లాడింది కొందరి గురించి మాత్రమే అయినా.. మీడియా మొత్తం దాన్ని తీసుకుందని భావించి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని విషయాలపై చర్చకు ఆహ్వానం పలుకే ఆలోచనలో ఉన్నాడట తారక్.

Total Views: 5093 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రోజా కాళ్లు పట్టుకుంటా.. కాకపోతే!

రోజా, బండ్ల గణేష్ ల వివాదం ముదిరి పాకాన పడుతోంది.