‘జై లవకుశ’ మూవీ రివ్యూ

ఎన్టీఆర్‌ సినిమా అంటేనే అభిమానులకు పండగ. తన డాన్సులు, నటన, డైలాగులతో విందు భోజనం వడ్డిస్తాడు. ఒక్క ఎన్టీఆరే ఇన్ని చేస్తుంటే.. ముగ్గురు ఎన్టీర్లను చూపిస్తే ఇంకెన్ని చేయొచ్చు..?? ఈ ఆలోచన నుంచి పుట్టిన ‘జై లవకుశ’ ఈ రోజులు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.నెగ‌టివ్ షేడ్స్ ఉండే పాత్ర‌ను ఎన్టీఆర్ ఎలా చేశాడు. అస‌లు సినిమా ఎలా ఉండ‌బోతుంది. వంటి అంశాలు ఆస‌క్తిని రేపాయి. అసలు మూడు పాత్ర‌ల‌ను ఎన్టీఆర్ ఎలా బేల‌న్స్ చేశాడు. క‌థ‌కు న్యాయం చేశాడా లేదా అనే విష‌యాలు అభిమానులను ఆకట్టుకుందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం..

కథ :
జై, లవ, కుశ (ముగ్గురు ఎన్టీఆర్‌లు) కవల సోదరులు. జైకి నత్తి. సరిగా మాట్లాడలేడు. అందుకే మిగిలిన ఇద్దరు సోదరులతో కలవలేడు. లవ, కుశ కూడా జైని చిన్న చూపు చూస్తారు. ఈ కారణంగా చిన్నప్పుడే తన సోదరులపై కోపం పెంచుకొంటాడు జై. ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు ముగ్గురూ… చిన్నప్పుడే తప్పిపోతారు. లవ కుమార్‌ పెరిగి పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు. కుశ ఏదోలా మాయ చేసి, అమెరికా వెళ్లి, గ్రీన్‌ కార్డ్‌ సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలగంటాడు. వీరిద్దరి జీవితాల్లోకి ‘జై’ ప్రవేశిస్తాడు.చిన్నప్పటి పగనీ, ప్రతీకారాన్నీ ఎలా తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వీళ్లని ఎలా వాడుకొన్నాడు? ఈ ముగ్గురూ కలిశారా? కలిసుంటూనే ఒకరిపై మరొకరు పోరాటం చేశారా? చివరికు ఏం జరిగిందన్నదే మిగిలిన కథ.

విశ్లేష‌ణ‌:
జై, లవ‌, కుశ పాత్ర‌ల్లో ఎన్టీఆర్ న‌ట‌నను ఇర‌గ‌దీశాడు. నెమ్మ‌ద‌స్థుడు, మంచివాడు, బ్యాంక్ ఆఫీస‌ర్ అయిన ల‌వ‌కుమార్ పాత్ర‌లో, దొంగ పాత్ర అయిన కుశుడిగా మెప్పించాడు. ఇక క‌థ‌కు మూలం అయిన జై పాత్ర‌లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ఫీక్స్‌లో ఉంది.విశ్రాంతి ఘట్టం నుంచి ‘జై’ విశ్వరూపం మొదలవుతుంది. డ్యాన్సుల విష‌యంలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ల‌వ‌కుమార్‌, కుశ పాత్ర‌లు కామెడీతో మిక్స్ అయ్యి ఉంటాయి. ముఖ్యంగా కుశుడు పాత్ర పూర్తి మాస్ కామెడీ ఉంటుంది. అన్న‌ల‌ను మోసం చేసి పారిపోవాల‌నుకోవ‌డం, ప‌ట్టుబ‌డిపోవ‌డం ఆ సంద‌ర్భంలో స‌న్నివేశాల ప‌రంగా వ‌చ్చే కామెడి బావుంటుంది. ఇక సెంటిమెంట్ స‌న్నివేశాల్లో కూడా ఎన్టీఆర్ న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. ప్రీ క్లైమాక్స్‌లో జై త‌మ‌ను క్ష‌మించాల్సిందిగా త‌మ్ముళ్లు ప్రాధేయ‌ప‌డ‌టం, అలాగే త‌మ్ముళ్ల‌ను క్ష‌మించ‌మ‌ని పోసాని క్లైమాక్స్ లో చేసే స‌న్నివేశంలో సెంటిమెంట్ మెప్పించింది. రావ‌ణుడిగా మారిన జై హావ‌భావాలు, న‌ట‌న మాస్ ఆడియెన్స్‌కు, అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.

రాశీఖన్నా గ్లామరెస్‌గా కనిపించింది. నివేదా పాత్ర కూడా కీలకమే. కానీ ఇద్దరి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా తక్కువ. తమన్నా ఓ పాటలో మెరిసింది.ఇక సాయికుమార్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, రోనిత్ రాయ్‌, అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.ఇక సాంకేతిక వ‌ర్గం విష‌యానికి వ‌స్తే, ద‌ర్శ‌కుడు బాబీ క‌థ‌ను, మాట‌ల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు. సెకండాఫ్‌లో ముందు ప‌ది నిమిషాలు మిన‌హాలో సినిమాలో ఎక్క‌డా ఏదీ ల్యాగ్ లేకుండా జాగ్ర‌త్త తీసుకున్నాడు. అలాగే రైతుల మీద ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌, అన్న‌ను తమ్ముళ్లు ప్రాధేయ‌ప‌డే స‌న్నివేశాల్లో సంభాష‌ణ‌లు బావుంటాయి.బాబి ఎంచుకొన్న కథలో వైవిధ్యం లేక‌పోయినా, ట్రీట్‌మెంట్‌ పరంగా ఆకట్టుకొంటుంది. దేవిశ్రీ సంగీతం ఆకట్టుకొంది. పాటల్లో కంటే, నేపథ్య సంగీతం విషయంలో చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. ‘జై’ పాత్రని ఎలివేట్‌ చేసేలా రూపొందించిన ‘రావణా..’ పాట ఆకట్టుకొంటుంది.అన్నింటికంటే చెప్పాకోవాల్సింది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

‘జైలవకుశ’ చూసినప్పుడు చాలా సన్నివేశాలు చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫిల్మ్ గుర్తుకొస్తుంది.. అందులోనూ అంతే! కాకపోతే క్యారెక్టర్లు, ఉద్యోగాలు వేరు. ఫ్యాన్స్‌ కోసమే జైలవకుశ తీశారనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. సెకండాఫ్‌లో స్టోరీ కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెంటిమెంట్‌ మరీ ఎక్కువగా వుంది. ఫ్యామిలీకి చెందిన సన్నివేశాలు ఓకే. కథలో కొత్తదనం లేదు.. అందరికీ తెల్సిందే!

రేటింగ్ : 2.7

(Satish K.S.R.K)

Total Views: 2758 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే