దుమ్ము లేపిన ‘జై ల‌వ‌కుశ’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌!

ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యం గా ఎన్టీఆర్ చేసిన జై రోల్ కు అభిమానులు , ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త యావరేజ్ గా ఉన్న కానీ సెకండ్ హాఫ్ అదిరిపోవడం తో థియేటర్స్ నుండి బయటకు వచ్చాక హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ కావడం తో ఫస్ట్ డే ఓపెనింగ్స్ అన్ని చోట్ల అదిరిపోయాయి.

నైజాం ఏరియాలో చూసుకుంటే రూ.5.05 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. అలాగే సీడెడ్లో రూ. 3.77 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మొదటిరోజు షేర్ రూ.20 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇకపోతే ఓవర్సీస్లో ప్రీమియర్ల ద్వారానే హాఫ్ మిలియన్ మార్కును అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.

Total Views: 1281 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

చిరు 2 లక్షల ఆర్ధిక సహాయం!

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కుమార్ “మనం సైతం” పేరుతో