మ‌ళ్లీ.. మ‌ళ్లీ అదే అవ‌మానం!!

Mahanadu2016మహానాడును తిరుపతిలో అంగరంగ వైభోగంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు నుంచి మూడు రోజులపాటు మహానాడు జరుగుతుంది. నిన్నటి వరకు జిల్లా స్థాయిలలో మహానాడు కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో నిర్వహించారు. ఇప్పుడు జరిగే మహానాడులో రెండు రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నారు.

ఇక, హిందూపురం నియోజక వర్గ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మొరాకో లో జరుగుతున్నది. అక్కడి షెడ్యూల్ ను పూర్తిచేసుకొని బాలయ్య ఇండియా వచ్చారు.కాగా, మూడు రోజుల పాటు జరిగే మహానాడులో బాలయ్య పాల్గొంటారు.

ఇక ఇదిలా ఉంటే, ఈ మహానాడుకు బాబు అందర్నీ ఆహ్వానించారు. అయితే, జూనియర్ ను ఆహ్వానించలేదని సమాచారం.ఆయన కూడా సింపుల్ గా నిన్నటికి నిన్న తాత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేసి, చెన్నయ్ వెళ్లిపోయారు. ఇప్పటికే బాబుకు, జూనియర్ కు మధ్య దూరం పెరిగింది. ఈ దూరాన్ని తగ్గించేందుకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించినా దూరం తగ్గడం లేదు. 2019 నాటికి చంద్రబాబు-లోకేష్ కాంబినేషన్లోనే తెలుగుదేశం ఎన్నికల ఫైట్ వుంటుంది. గెలిచిందా మళ్లీ వారే. ఓడినా మళ్లీ వారే.ఓడినంత మాత్రాన ఎన్టీఆర్ ను పిలచి పీట వేస్తారనుకొవడం భ్రమే. అందువల్ల ఇప్పట్లో ఎన్టీఆర్ కు ఎంట్రీ వుండదు.

ఎన్నికల నుంచి..
నిజానికి గత మహానాడులోనే చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ, లోకేష్ ఫ్లెక్సీలు పెడితే అప్పట్లో ఎన్టీ రామారావు తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో చంద్రబాబు తనయుడి విషయంలో వెనక్కి తగ్గారు. అప్పటి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా అనే చర్చ జరిగింది. చివరికి తనను ఎవరూ పిలవలేదంటూ ఎన్టీఆర్ ప్రకటించడంతో.. బొట్టు పెట్టి ఎవరూ పిలవరు.. ఎవరికి వారు రావాల్సిందేనని బాలకృష్ణ కూడా చురకలు అంటించారు. అప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. నిజానికి గత సాధారణ ఎన్నికల్లో కూడా జూ.ఎన్టీఆర్ ప్రచారానికి వెళతారని అనుకున్నా, ఆయనని చంద్రబాబు పిలవలేదనే టాక్ వినిపించింది. జూ.ఎన్టీఆర్ కు బదులు.. పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి వాడుకుని చంద్రబాబు… ఎన్టీఆర్ ని దూరం పెట్టారు.

ఇక ఇదిలా ఉంటే, ఈ మహానాడు సమయంలో జూనియర్ షూటింగ్ కోసం చెన్నై వెళ్లిపోయారు. జనతా గ్యారేజ్ షూటింగ్ చెన్నై జరగబోతున్నది. అయితే, మహానాడు ఉన్నది అని తెలిసి, ఎలాగో ఆహ్వానం రాదు కాబట్టి చెన్నైలో జనతా గ్యారేజ్ షూటింగ్ పెట్టుకున్నారా అన్నది తెలియాలి.

Total Views: 10996 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

యెడ్డీ అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో?

దేశ రాజకీయ ముఖ చిత్రం పై యడ్యూరప్ప అంత దురదృష్టవంతుడు