సిద్ధూ రాజీనామా.. సంబురాల్లో జేడీఎస్!

నేడు వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104 స్థానాల్లో, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాల్లో గెలుపొందారు. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాగా కాంగ్రెస్ భేషరుతుగా జేడీఎస్‌కు మద్ధతును ప్రకటించింది. దీంతో కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యంగా అగుపిస్తోంది. ఈ క్రమంలో భాగంగా గవర్నర్‌ను కలవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతలు వెళ్లారు. వీరికి గవర్నర్ వాజుభాయ్ వాలా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. సాంప్రదాయాన్ని అనుసరించి ఎన్నికల్లో అతిపెద్ద మెజార్టీ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించనున్నట్లు సమాచారం.

మరో వైపు జేడీఎస్ నేత కుమారస్వామి గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఇచ్చిన మద్దతును తాము అంగీకరించామని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో గవర్నర్‌ను కోరారు కుమారస్వామి. 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్.. బేషరతుగా 38 సీట్లు గెలిచిన జేడీఎస్‌కు మద్దతివ్వడం కర్ణాటక రాజకీయాలను రసవత్తరంగా మార్చేసింది. 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా.. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని భావించిన కాంగ్రెస్.. అంతలోనే జేడీఎస్ నేతలతో సంప్రదింపులు జరపడం గమనార్హం.

ఇదిలా ఉంటె కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా సమర్పించారు. గవర్నర్ వాజూభాయ్ వాలాకు తన రాజీనామా పత్రాన్ని ఆయన సమర్పించారు.

Total Views: 124 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా