తండ్రికి తగ్గ కొడుకు!!

వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలకు కేరాప్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపుంర ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. వివాదాస్పద నేతగా వుండే జెసి కాంగ్రెస్ పార్టీలో వున్న తరహాలోనే టిడిపిలో కూడా దూసుకుపోతున్నారు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు. ఆయన తనయుడు పవన్ తండ్రిలాగే వివాదాస్పద వ్యాఖ్యలతో తాజాగా వార్తలకు ఎక్కారు. అనంతపురంలో ఆయన కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో వైసిపి గాలి రాయలసీమలో వీయడంతో టిడిపికి అభ్యర్ధే లేరని అన్నారు. అలాంటి దశలో దివాకర రెడ్డి టిడిపిలోకి వచ్చి ఆ పార్టీ కి జీవం పోశారన్నారు. తనతండ్రికి అడ్డువచ్చే నేతే అనంతపురంలో లేరని ప్రధాని వచ్చి పోటీ చేసినా, ముఖ్యమంత్రి వచ్చి పోటీ చేసినా తమ ముందు దిగదుడుపే అన్న స్థాయిలో హాట్ హాట్ వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఇదే టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. పుత్రరత్నం అన్న మాటలకు జెసి ఏమి చెబుతారో చూడాలి. సుపుత్ర కొంప ముంచావని అంటారా శభాష్ అంటారో మరి.

ఎవరి తొడ వాళ్లుకొట్టుకుంటే పర్వాలేదు కానీ పక్కనోళ్ల తొడలు కూడా మేమే కొడతామంటే మాత్రం ఇబ్బందే. అందులోనూ రాజకీయ వారసులు అయితే మరీ నొప్పెక్కుతుంది. ఈ విషయం జేసీ పవన్, అదే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు ఎంత త్వరగా తెలుసుకుంటే మంచిది. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నావ్. కుర్రాడివి. దూకుడు ఉండాలి కానీ…ఏం మాట్లాడాలి… ఎలా మాట్లాడాలి… ఎందుకు అనాలి… ఎందుకు అనకూడదనేది తెలుసుకోవాలి.

Total Views: 519 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ