సీఐని ఉద్దేశించి జేసీ తీవ్ర వ్యాఖ్యలు

నాలుక కోస్తానంటూ హెచ్చరించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ పై అనంతపురం టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేమైనా సాయికుమార్ సినిమానా మీసాలు తిప్పడానికని సీఐని ఉద్దేశించి జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ వేరు, సినిమాలు వేరని చెప్పారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్ కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు? అంటూ సవాల్ విసిరారు. ‘నాలుకే కోయాలనుకుంటే వచ్చి కోసేయ్… నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా’ అన్నారు.

ప్రబోధానంద అనుచరులనే ఏమీ చేయలేకపోయావ్… నా దగ్గరకు వస్తావా? అంటూ జేసీ ప్రశ్నించారు. ‘నువ్వు ఖాకీ బట్టలు వదిలేసి రా… నేను కూడా ఈ బట్టలు వదిలేసి మామూలు బట్టలతో వస్తా… నీ సంగతేందో చూస్తా’ అంటూ హెచ్చరించారు. నీది నిజమైన మీసమే అయితే ఎప్పుడొస్తావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. 25వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని… ఏం చేస్తావో చేసుకో అంటూ ఛాలెంజ్ చేశారు. ఈలోగా కత్తికి బాగా పదును పెట్టుకో అన్నారు.

Total Views: 90 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

దమ్ముంటే పంచాయితీ ఎన్నికలకు పెట్టండి : పవన్ సవాల్!

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన’ కవాతు ముగిసింది.