ఆసక్తి కలిగిస్తోన్న జనసేన సర్వే!

పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి గత ఎన్నికల్లో టిడిపి – బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ని అధికార కూటమి పెద్దగా పట్టించుకోవడం లేదు ముఖ్యం గా బిజెపి పార్టీ అయితే పవన్ కళ్యాణ్ ని కూరలో కరివేపాకులా తీసిపడేసింది.ఇది జనసేన కార్యకర్తలకు రుచించడం లేదు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ని మోడీ దగ్గరకు తీసుకెళ్లారు బిజెపి నాయకులు . అలాగే మోడీ – చంద్రబాబు లు పాల్గొన్న బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కట్ చేస్తే అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం మానేశారు.

దాంతో చిర్రెత్తు కొచ్చిన పవన్ 2019ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు . అయితే ఆంధ్రప్రదేశ్ లో 2019 లో పరిస్థితులు ఎలా ఉంటాయి , జనసేన పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశం పై పవన్ కి అత్యంత సన్నిహితుడు, అందరికి తెలిసిన వ్యక్తి ఒకరు రహస్య సర్వే చేయించారట . ఆ సర్వే ప్రకారం జనసేన పార్టీ కి 57 నుండి 62 సీట్లు రావొచ్చని ఆపార్టీ అధికారప్రతినిధి సుంకర కళ్యాణ్ దిలీప్ చెబుతున్నారు.

సెర్వే ప్రకారం చూసుకున్నఅన్నిసీట్లు వస్తే మాత్రం పవన్ మళ్ళీ కింగ్ మేకర్ ఏ అవుతాడు.ఒకవేళ కొంచం అటు ఇటు అయినా కూడా పవన్ కి వచ్చిన డోకా కూడా ఏం లేదు. ఎందుకంటే కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ మాత్రం అవుతాడు పక్క.

కృష్ణ ,ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంద్ర నుంచి పవన్ కి అధిక సీట్లు వస్తాయి అని సెర్వే లో తేలిందంట. అంతే కాదు ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది.. అనంతపురం నుంచి కూడా జనసేన గాలి బాగా వీస్తుంది అంట. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు సెర్వేలో తేలింది. ఇంకా గుంటూరు , నెల్లూరు, చిత్తూరు , కర్నూలు, కడప జిల్లాల్లో వలస దారుల వల్ల అధికార పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అని తేలింది అంట. జగన్ లాభ పడవచ్చు అని కూడా చెబుతున్నారు.

కీడు ఎంచి..మేలు ఎంచాలి అంటారు పెద్దలు, దాని ప్రకారం చూసుకుంటే జనసేన, జగన్ , కమ్యూనిస్టులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి పరిస్థితి ప్రకారమే ఇన్ని సీట్లు వస్తే .2019 నాటికి ఇంకా మెరుగు పడవచ్చు అధికారం వచ్చినా రావొచ్చు అని భావిస్తున్నారట.

Total Views: 19359 ,

2 Comments

  1. 20seats kuda ravu u janasena ki

    1. Aa 20 kuda em papam chesay 0 seats vasthay ani cheppu?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే