ఈ రోజు నుంచి నేను రెల్లి కులస్థుడిని: పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని కుల,మతాలకు అతీతంగా వ్యవస్థాపించానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసినదే,తాను ఎప్పటి నుంచో తాను అందరి పార్టీ నేతల్లా కుల రాజకీయాలు చెయ్యనని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా పవన్ కొత్తగా కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారా అన్న ప్రశ్నలకు చెంపపెట్టుగా ఈ రోజు పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసేటటువంటి రెల్లి కులస్థులతో సభను ఏర్పాటు చేశారు.

ఆ సభలో పవన్ మాట్లాడుతూ రెల్లి కులస్తులంటే వారి మీద ఎంత వివక్షత చూపుతారో తనకి తెలుసనీ,మీ లాంటి వారికి కూడా అండగా నిలబడకపోతే తప్పు చేసినవాడిని అవుతానని చెప్పుకొచ్చారు.మీకు ఎవరైనా అద్దెకి ఇల్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ కూడా మా కులస్థుడే అని చెప్పండి అని వారికి తెలిపారు.ఈ సారి ఎవరైనా తనది ఏ కులం అని అడిగితే నాది పారిశుద్ధ్య కులం అని చెప్తానని,మీరు రోడ్ల మీద ఉన్న చెత్తని శుభ్రం చేస్తే నేను రాజకీయాల్లో ఉన్న చెత్తని శుభ్రం చేస్తానని తెలిపారు.అదే సందర్భంలో అందరు విభిన్న మతాలను స్వీకరిస్తుంటారు కానీ మీరు అందరు చెప్పండి ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రెల్లి మతాన్ని స్వీకరిస్తున్నాని తెలిపారు.

Total Views: 2306 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ