రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ సర్కార్ తన పంతం నెగ్గించుకుంది. ఆర్టికల్ 370, 35-A రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ ని రెండు ముక్కలు చేసింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ ని విభజించారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ని చేశారు. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ని చేశారు. ఈ మేరకు రాజ్యసభలో అమిత్ షా సవరణ ప్రకటన చేశారు.

ఇకపై ఢిల్లీ తరహాలోనే జమ్మూకశ్మీర్ లో పాలన ఉండబోతోంది. పార్లమెంటులో చేసిన ప్రతి చట్టం ఇకపై జమ్మూలో అమలవుతుంది. రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల నడుమ అమిత్ షా కీలక సవరణలు ప్రవేశపెట్టారు. లడఖ్ వాసుల ఆకాంక్షల మేరకే కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నామని షా చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సంచలన నిర్ణయం. జమ్మూకశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ కి రాజ్యాంగంలో కల్పించిన ప్రత్యేక అధికారాలు రద్దు చేసింది మోడీ సర్కార్. జమ్మూకశ్మీర్ ముఖచిత్రాన్ని మార్చేశారు. ఇకపై కేంద్రం చేతిలోనే జమ్మూకశ్మీర్ లా అండ్ ఆర్డర్ ఉండనుంది.

* ఆర్టికల్ 370, 35-ఏ రద్దు
* ప్రత్యేక ప్రతిపత్తి హోదా కోల్పోయిన జమ్మూకాశ్మీర్
* రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్
* అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్
* అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్
* లడఖ్ లో లెఫ్టినెంట్ గవర్నర్ కే ఇక పూర్తి అధికారులు
* కేంద్రం పరిధిలోనే జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు
* జమ్మూకశ్మీర్ ఇక భారత దేశంలో పూర్తి అంతర్భాగం

Total Views: 15668 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

దట్ ఈజ్ పవన్ కళ్యాణ్

దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ Total Views: 973 ,