పవన్ పై జలీల్ ఖాన్ పంచులు!

గోదావ‌రి జిల్లాలో నిర్వ‌హించిన జ‌న‌సేన కవాతుకు భారీగా స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిస‌లిందే. అయితే జ‌న‌సేన క‌వాతులో భాగంగా మాట్లాడిన ప‌వ‌న్ అధికార టీడీపీ పై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని.. గ్రామ స‌ర్పంచ్‌గా కూడా గెల‌వ‌లేని లోకేష్‌ను మంత్రిని ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

దీంతో పవ‌న్ చేసిన వ్యాఖ్య‌ల పై టీడీపీ నేత‌లు దాడి మొద‌లు పెట్టారు. ప‌వ‌న్ త‌న నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని.. సందుల్లో గొందుల్లో స‌భ‌లు పెట్టి ఎక్కువ‌గా జ‌నాలు వ‌చ్చిన‌ట్టు సంబంర‌ప‌డిపోతున్నార‌ని.. ద‌మ్ముంటే జాతీయ ర‌హ‌దారుల పై సభ‌లు పెట్టి త‌న బ‌ల‌మేంటో ఊపించాల‌ని మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావు అన్నారు. ఇక ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కూడా ప‌వ‌న్ పై సెటైర్లు వేశారు. ప‌వ‌న్ వారస‌త్వం గురించి మాట్లాడే అర్హ‌త లేద‌ని.. ఇప్పుడు వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి మాట్లాడిన ప‌వ‌న్.. సినిమాల్లోకి ఎలా వ‌చ్చారో తెలియ‌దా.. అది వార‌స‌త్వ కాదా అని జ‌లీల్ ఖాన్ ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌కి సినిమాల్లో అవ‌కాశాలు లేకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాద‌ని జ‌లీల్‌ఖాన్ ఫైర్ అయ్యారు.

Total Views: 110 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే