సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర భారీ నగదుతో ఐటీ సిబ్బందికి పట్టుబడినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్న వసుంధరను రేణిగుంట ఎయిర్ పోర్టులో ఐటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే వారి సోదాల్లో వసుంధర వద్ద దాదాపు రూ.10లక్షల వరకు నగదు లభ్యమైనట్టు తెలుస్తోంది. తిరుమల దేవాలయంలో కానుకలుగా వేయడానికి అంత మొత్తంలో తీసుకు వచ్చినట్టు అధికారుతో చెప్పినా, డబ్బంతా పాత కరెన్సీలోనే ఉందని, దేనికి లెక్కల్లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, పత్రాలు చూపించడంతో వదిలిపెట్టామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు బాలకృష్ణ స్వయానా వియ్యంకుడు కావడంతో ఉన్నత స్థాయిలో ఒత్తిడితోనే ఐటీ అధికారులు వసుంధరను విడిచిపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.