రాత్రంతా ఛార్జింగ్‌తో బ్యాటరీ పాడవుతుందా…?

ఉదయమంతా మొబైల్‌ వాడి, రాత్రి నిద్రపోయే సమయంలో దాన్ని ఛార్జింగ్‌ పెట్టడం చాలామందికి అలవాటు. ఇది చాలా ఇళ్లలో జరిగే పనే. అయితే ఇలా రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్‌ చేస్తే మొబైల్‌ బ్యాటరీ చెడిపోతుంది అంటుంటారు. బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందనీ చెబుతుంటారు. ఈ ఇబ్బంది కొత్త తరం మొబైళ్లలో ఉండదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం వస్తోన్న స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్‌ అయిపోయాక ఆ ప్రక్రియ నిలిచిపోయేలా మొబైల్‌, ఛార్జర్లలో సాంకేతికతను జోడించారు. దాని వల్ల బ్యాటరీ ఛార్జింగ్‌ వంద శాతానికి చేరుకోగానే ఛార్జింగ్‌ ప్రక్రియ ఆగిపోతుంది. కాబట్టి ఆ సదుపాయం ఉంటే బ్యాటరీ పేలిపోతుందనే ఆందోళన అక్కర్లేదు.

Total Views: 1796 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

సంచలన నిర్ణయం! మార్కెట్లోకి 200 నోట్లు! ప్రత్యేకతలు ఇవే!

రెండు వందల రూపాయల నోట్ల నమూనాలను విడుదల చేసింది ఆర్బీఐ.