ఐపీఎల్ వేలంలో సంచలనాలు : హనుమ విహారి జాక్‌పాట్‌

పదకొండు సీజన్‌లుగా అలరించిన ఐపీఎల్‌ .. పన‍్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఐపీఎల్‌–12 సీజన్‌ కోసం ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన వేలం క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించనుంది.2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు ‘పింక్‌ సిటీ’ జైపూర్‌ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్‌ ఉన్నందున… లీగ్‌ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్‌పాట్‌ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్‌ తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

*మోహిత్‌ శర్మను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. అతన్ని రూ. 5 కోట్ల భారీ మొత్తం చెల్లించి సీఎస్‌కే కొనుగోలు చేసింది.

*వరుణ్‌ అరోన్‌ రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

*మహ్మద్‌ షమీని రూ. 4.80 కోట్లకు కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది.

* లసిత్‌ మలింగాను ముంబై ఇండియన్స్‌ చేజిక్కించుకుంది.

*ఇషాంత్‌ శర్మను కోటి 10 లక్షలకు ఢిల్లీ కేపిటల్‌ తీసుకుంది.

*జయదేవ్‌ ఉనాద్కత్‌ రూ. 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

*వృద్ధిమాన్‌ సాహా , అతన్ని రూ. 1కోటి 20 లక్షలకు సన్‌రైజర్స్‌ తీసుకుంది.

*విండీస్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ను కింగ్స్‌ పంజాబ్‌ రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది.

*జానీ బెయిర్‌ స్టో , రెండు కోట్ల 20 లక్షలకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది.

*అక్షర్‌ పటేల్‌ను రూ. 5 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది.

*విండీస్‌ ఆల్‌ రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ను రూ. 5 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్నికోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేసింది.

*విండీస్‌ చిచ్చర పిడుగు హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

*హనుమ విహారినికి ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. రెండు కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

Total Views: 850 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే