ఇక్కడ వైసీపీకి కష్టమేనా…?

ప్రజాపోరాట యాత్ర తో జిల్లాలో వైసీపీ శ్రేణులులో నూతన ఉత్షాహం నెలకుంది.పార్టీ నాయకులలో స్తబ్దత నెలకుంది.పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారులో ఆందోళన మొదలైంది.వచ్చే ఎన్నికలలో టిక్కెట్ తమకే దక్కుతుంది అనుకొనే వారికీ చేదు అనుభవాలు ఎదురు అవుతున్నాయి.దింతో జిల్లాలో వైసీపీ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఎక్కడ అని ఆసక్తిగా ఉంది కదా.మరెందుకు ఆలస్యం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పై ఓ లుక్ వేయండి.

వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోరాట యాత్ర ముగిసే ముందే ఆ పార్టీలో ముసలం మొదలైంది. విజయనగరం జిల్లా పర్యటన పూర్తి చేసుకొని శ్రీకాకుళంలో వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మరి కొద్ది రోజుల లో ముగియనుంది.ఈ లోగ పార్టీలో సీనియర్లు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ నెల్లిమర్లలో బహిరంగ సభను నిర్వహించారు.సభను జయప్రదం చేయడం లో విజయ వంతం అయ్యారు.అప్పటికే నెల్లిమర్ల నియోజక వర్గానికి మాజీ మంత్రి రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివ రాజు కుమారుడు డాక్టర్ సురేష్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.ఈయన 2014 ఎన్నికలలో పోటీచేసి వాటిమీ పాలు అయినప్పటి నుండి నియోజక వర్గంలో ప్రజాసమస్యలు పై పోరాటం చేపడుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో సాంబశివునికి మీరు పోటీకి సిద్ధం కావాలని జగన్ చెప్పడం తో సాంబశివరాజు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరో కొద్దిరోజులులో జగన్ పర్యటన ముగియనుండడం తో నెల్లిమర్ల నియోజక వర్గం సమన్వయకర్త గా మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ బంధువు బడుకొండ అప్పలనాయుడు ని జగన్ శ్రీకాకుళంలో ప్రకటించడం తో సాంబశివుని వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. విషయం తెలుసుకున్న సాంబశివ రాజు అయన అనుచరులు శ్రీకాకుళంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి నెల్లిమర్ల టికెట్ సాంబశివరాజు కి ఇవ్వాలని కోరారు. సామజిక సమీకరణాలు నేపథ్యంలో నెల్లిమర్ల టికెట్ బీసీలకు ఇస్తున్నాం అని జగన్ చెప్పటంతో సాంబశివుని వర్గం అవాక్ అయ్యారు.ఆ సందర్భం లో సాంబశివ రాజు కూడా జగన్ కు తనదైనా శైలిలో దీటుగా సమాధానం చెప్పడం తో పార్టీ అధికారం లోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన సాంబశివుని వర్గం శాంతించలేదు. ఎన్నికలలో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి సత్తా చూపించాలని అనుచరులు సాంబశివుని పై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిస్తుంది.

అనుచరులు వత్తిడి మేరకు వైస్సార్సీపీ ని వదిలి ఏ పార్టీలో చేరాలి అనే ఆలోచనలో సాంబశివుడు ఉన్నట్లు తెలుసుకున్న అధికారపార్టీ ఇప్పటికే ఆయనతో చర్చలు కొనసాగిస్తుంది.అనుచరులు వత్తిడి మేరకు టీడీపీ లో చేరి పోటీ చేయాలా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా అని సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.సాంబశివునికి జరిగిన అన్యాయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాంబశివునికి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలో రావాలని కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రాజ్యసభ ఇస్తామని చెపినట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్ నాయకుడు సాంబశివ రాజు వైసీపీని విడితే ఆ ప్రభావం మూడు నియోజక వర్గాలు పై ప్రభావం ఉంటుందని కొంతమంది వైసీపీ నాయుకులు జగన్ మోహన్ రెడ్డికి చెప్పడం తో సాంబశివుని బుజ్జగించే బాధ్యత ఉత్తరాంధ్ర కన్వీనర్ సాంబశివుని శిస్యుడు ఎమ్మెల్సీ కోలగట్ల కు ,భూమా కరుణాకర్ రెడ్డికి అప్పగించారు.పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను మోసిన సీనియర్ ని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని సాంబశివుడు ఎమ్మెల్సీ కోలగట్ల ముందు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే సాంబశివుని కలిసి ఎలాగైనా ఒప్పించాలని భూమా కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్న సాంబశివుడు వీరికి అందుబాటులో లేకపోవడం తో జిల్లా వైసీపీ శ్రేణులులో ఆందోళన నెలకుంది.జిల్లాలో ఈ సారి వైసీపీ కి సానుకూలంగా ఉందనుకున్న సమయంలో సాంబశివ రాజు ప్రభావం ఏమేరకు వైసీపీ పై పడుతుందో అని ఆందోళన కార్యకర్తలు, నాయకులలో నెలకొంది.

Total Views: 391 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ