కేటీఆర్ నమ్మినబంటుకు కొత్త కష్టం వచ్చి పడింది. రాష్ట్రంలోని బలమైన నాయకుల్లో ఒకరైన కాకా వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్ ఇద్దరూ బలమైన నేతలే. వారిలో వివేక్ తన సోదరుడు వినోద్ కు చెన్నూరు టికెట్ ఆశించగా దక్కలేదు. దీన్ని తీవ్రంగా తీసుకున్న వివేక్ కేసిఆర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. తనకు పెద్దపులి ఎంపీ టికెట్ దక్కినా సోదరుడు వినోద్ ఖాళీ చేతుల్తో మిగలడం వివేక్ కు రుచించలేదు.
అందుకే నాయకుడి నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే అవకాశం లేకపోయినా చెన్నూరు నియోజవర్గంలో సుమన్ తో కలిసి పనిచేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఓదెలు అసమ్మతి, వివేక్ అసంతృప్తి రెండూ కలిసి సుమన్ గెలుపుని కష్టతరంగా మార్చేలా కనిపిస్తున్నాయి.
Total Views: 93 ,