కంటతడి పెట్టిన హనుమంతన్న!

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై వెలసిన కరపత్రాలు ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. సీనియర్ నేతలపై విడుదలయిన ఈ కరపత్రంపై కాంగ్రెస్ పార్టీలో పెద్దయెత్తున చర్చే నడుస్తుంది. తమను పార్టీలోని కొందరు కావాలని టార్గెట్ చేశారని, అందుకనే ఇటువంటి ప్రచారానికి దిగారంటున్నారు సీనియర్ నేతలు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కొందరు నేతలు పార్టీని పట్టించుకోవడంలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంల లేదు. ఇటువంటి వారు పార్టీలో ఉన్నా ఒకటే…లేకున్నా ఒకటే అన్న నినాదంతో కరపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ తో సొమ్ములు సంపాదించుకుని ఇప్పుడు జల్సాలు చేస్తున్నారు కాని పార్టీకి పైసా కూడా ఉపయోగపడటం లేదన్నది ఆ కరపత్రం సారాంశం. కరపత్రం చివర్లో ‘‘ ఇట్లు జంటనగరాల కార్యకర్తలు’’ అని ఉండటం విశేషం.

అసలు విషయానికొస్తే మాజీ పార్లమెంటు సభ్యులు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి పేర్లతో ఈ కరపత్రం విడుదలయింది. వీరంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందడమే కాకుండా కావాల్సినంత సంపాదించి ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదని ఆ కరపత్రంలో ఆరోపించారు.అయితే దీనిపై సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరో కావాలని తమమీద కుట్ర పన్నుతున్నారని, పార్టీలోని కొందరి నేతల హస్తం ఉండి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. వీహెచ్ ఐతే ఇంకో అడుగు ముందుకేసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కంటతడిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు ఈ విధంగా కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టమని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని పత్రికల్లో తనపై అసత్య వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. తనపై ఈ విధంగా వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

 

Total Views: 205 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే