చాహల్ మాయాజాలం.. కోహ్లీసేన ఘనవిజయం

ఇంగ్లండ్తో చివరిదైన మూడో ట్వంటీ-20 మ్యాచ్ లో టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్లు చెలరేగారు.ఓటమితో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఆరంభించినా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకొంది. చిన్నస్వామి మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి ఇంగ్లండ్‌ ముందు భారీ విజయలక్ష్యాన్ని నిలిపింది. దాన్ని ఛేదించేందుకు దూకుడుగా ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 10 ఓవర్ల తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 16.3 ఓవర్లకు 127 పరుగులకే కుప్పకూలింది. జేసన్‌రాయ్‌ (32), జోరూట్‌ (42), ఇయాన్‌ మోర్గాన్‌ (40) మాత్రమే రాణించారు. చాహల్‌ స్పిన్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 119 పరుగుల వద్ద మూడు వికెట్లు, 127 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ పడగొట్టాడు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 4 పరుగుల వద్దే విరాట్‌కోహ్లీ (2) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్‌ రైనా (63; 45 బంతుల్లో 2×4, 5×6) ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (22; 18 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి చెలరేగాడు. వరుసగా సిక్సర్లు, బౌండరీలు బాదాడు. 65 పరుగుల వద్ద లోకేశ్‌ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (56; 36 బంతుల్లో 5×4, 2×6) చక్కని షాట్లతో అలరించాడు.మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో స్కోర్ బోర్డ్‌ను పరుగులు తీయించాడు యువరాజ్ . 18వ ఓవర్‌లో ధోనీతో కలిసి ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. 10 బంతుల్లో 27 పరుగులు చేసి చివరకు మిల్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

Total Views: 641 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అడిలైడ్ టెస్టులో కోహ్లీ సేన విజయకేతనం!

ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31