విరాట్ సేన ఘన విజయం

viratమొహాలీలో భారత జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. ఐఎస్ బింద్రా స్టేడియంలో తన సత్తా చాటింది. మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. మొహాలీ మొనగాళ్లం మేమేనంటూ టీమిండియా చాటుకుంది. మ్యాచ్ నాలుగో రోజు 103 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అలవోగా ఆ లక్ష్యాన్ని సాధించింది. ఫస్ట ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మిస్సయిన పార్ధివ్ ఆ లోటును సెకండ్ ఇన్నింగ్స్‌లో భర్తీ చేశాడు. వీలైనంత తర్వగా మ్యాచ్‌ను ముగించాలనో ఏమో… పార్దివ్ 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. 53 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బౌండరీతో జట్టుకు విజయం అందించాడు. పుజారా 25 పరుగులు చేశాడు. కోహ్లీ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలుత 78/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. టీ విరామ సమయానికి ముందే 236 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 102 పరుగుల ఆధిక్యత మాత్రమే సాధించింది. జో రూట్ (78), హసీబ్ హమీద్ (59) పోరాడినా ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. క్రిస్ వోక్స్ 30 పరుగులు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగి హాఫ్ సెంచరీలతో రాణించి స్పిన్నర్లు జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో బాల్‌తో ప్రతాపం చూపి భారత్ విజయానికి బాట వేశారు. వీరికి ఫాస్ట్ బౌలర్ షమీ జత కలిశాడు. అశ్విన్ 3, జడేజా, జయంత్, షమీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
స్కోర్లు – ఇంగ్లండ్ 283, 236 — భారత్ 417, 104 (2 వికెట్లు, 20.2 ఓవర్లలో)

Total Views: 949 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మమ్మల్ని ఎందుకలా చూస్తారు!

నెటిజెన్లు పై మండిపడ్డారు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల. ముఖ్యంగా క్రికెటర్