అత్యంత పాశవికంగా చిన్నారుల హత్యా..!

హైదరాబాద్ లోని చైతన్యపురిలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది.అంగవైకల్యం ఉన్న ఇద్దరు కవల చిన్నారులను కర్కషంగా హత్య చేశారు. అర్ధరాత్రి చిన్నారుల మృతదేహాలను కారులో తరలిస్తు,,పోలీసులు కంటపడడంతో బండారం బయటపడింది.

అసలు వివరాల్లోకి వెళితే.. చైతన్య పూరికి చెందిన ఓ వ్యక్తి రెండు శవాలను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై అరా తీయగ.. మిర్యాలగూడకు చెందిన లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు 12 ఏళ్ల వయసున్న సృజనరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి అనే కవలలున్నారు. వారికి మానసిక స్థితి అంతగా బావుండదు. అయితే ఇటీవల కవలల మేన మామ ఇద్దరిని హైదరాబాద్ కు తీసుకు వచ్చాడు.

వారిని వదిలించుకోవాలని మేన మామ ఇద్దరిని హత్య చేశాడు. రెండు మృతదేహాలను కారులో తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా ఇంటి యజమాని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఇంకా హత్యకు గల అసలు కారణాలు ఏమైనా ఉంటాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Total Views: 108 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన ఖాకినే..లైంగిక వేధింపులు!

న్యాయాన్ని రక్షించాల్సిన ఖాకి నిస్సహాయ స్థితిలో ఉన్న అడపడుచును లైంగిక