ఆమె పాలిట స్నేహితుడే యముడు!

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్‌లో గురువారం సాయంత్రం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కొత్తూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష అనే డిగ్రీ విద్యార్థిని ఈ ఘటనలో బలయింది. శిరీషను స్నేహితుడే దారుణంగా హత్య చేసి చంపేశాడు.ఈ హత్య కేసులో శంకర్ పల్లి పోలీసులు నిందితుడు సాయిప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాయిప్రసాద్, శిరీష స్నేహంగా ఉంటున్నారు. కాగా, ఇటీవల శిరీష వేరే అబ్బాయితో చనువుగా ఉంటోందని సాయిప్రసాద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శిరీషపై కసి పెంచుకున్న సాయి ప్రసాద్ ఆమెను గొంతుకోసి దారుణంగా హత్యచేశాడని అనుమానిస్తున్నారు.

శిరీషపై అనుమానంతో ఉన్న సాయిప్రసాద్ మాట్లాడుకుందామని, శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ కు రమ్మని పిలిచాడు. దీంతో గురువారం ఉదయం ఇద్దరూ కలిసి రిసార్ట్స్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇంకో అబ్బాయితో ఎందుకు చనువుగా ఉంటున్నావని శిరీషను ప్రసాద్ ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. శిరీషపై మరింత కోపం పెంచుకున్న అతడు వెనకనుంచి కత్తితో గొంతుకోసి, ఛాతిపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు శిరీషను హత్య చేయడానికి ముందస్తు పథకంతోనే కత్తితో వచ్చాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హత్యకు ముందు తనను పెళ్లి చేసుకోవాలని శిరీషకు చెప్పానని, అయినా వినలేదని సాయిప్రసాద్ విచారణలో అంగీకరించాడు. తాను ఆమెపై లైంగికదాడి చేయలేదని పోలీసులకు తెలిపాడు. శిరీష మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కాగా, గురువారం మధ్యాహ్నమే ఈ ఘటన జరిగినా రాత్రి వరకు బయటకు రాకుండా రిసార్ట్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలుస్తొంది.

 

Total Views: 140 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కరక్కాయ తో కోట్లు స్కామ్..!

ముందు దగా.. వెనుక దగా.. కుడి ఎడమల్లోనూ దగా.. అవును,