ప్రేమించినవాడిని మంచానికి కట్టేసి..!

వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడిని నమ్మించి ప్రియురాలే హత్య చేసింది. మంచానికి కట్టేసి కిరోసిన్‌ పోసి తగలబెట్టింది.  పోలీసుల కథనం మేరకు వివారాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షేక్‌ షబ్బీర్‌ (32) మర్రిపూడి పోలీసుస్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. పొదిలికి చెందిన ఇమాంబీతో షబ్బీర్‌కు పరిచయమైంది. ఈ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి కొనకనమిట్ల మండలం చవటపల్లి, పేరారెడ్డిపల్లిలో ఉన్న కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు.  ఇటీవల కోళ్ల ఫారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం కోళ్ల ఫారం నుంచి మంటలు రావడంతో స్థానికులు వెళ్లి ఇమాంబీని ప్రశ్నించారు. లోపలికి వెళ్లి చూడగా షబ్బీర్‌ కాలిపోయి మృతదేహమై కనిపించాడు. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చాయని ఇమాంబీ చెప్పినప్పటికీ.. మృతదేహం ఉన్న తీరు చూస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించారని పోలీసులు నిర్ధారించారు. మృతుడి కాళ్లూ చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి ఉన్నాయి. ఇమాంబీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Total Views: 118 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మానవ మృగాలు:ఒకవైపు మామయ్య.. మరోవైపు పిన్ని కొడుకు!

మనుషుల రూపంలో మానవ మృగాలు జనారణ్యంలో తిరుగుతున్నాయి. మంచి తనం