మరో చారిత్రక ఘట్టానికి సాక్షిగా రాజమండ్రి బ్రిడ్జ్

రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. దివంగత నేత రాజేశేఖర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి మరో జననేత ఈ రైల్ కం రోడ్ బ్రిడ్జ్ మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి పాదయాత్రగా రానున్నారు.

నాడు ‘ప్రజా ప్రస్థానం’ పేరిట రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన వేళ, 2013, జూన్ 4న ఆయన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ఈ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.ఆపై వైఎస్ఆర్ పాదయాత్రను గుర్తు చేస్తూ, ఆయన కుమార్తె, జగన్ సోదరి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్రను చేపట్టి, 2013 జూన్ 4న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించింది.

ఇక తాజాగా ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను ముగించుకున్న జగన్, నేడు ఇదే వంతెనపై నుంచి నడుస్తూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుండటంతో, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నేతల పాదయాత్రతో జిల్లాలోకి ప్రవేశిస్తుండటంతో, ఈ క్షణాలను ఓ చారిత్రక ఘట్టంగా వైకాపా శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.ఇప్పటికే జగన్ కు స్వాగతం పలుకుతూ, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ రావు ఆధ్వర్యంలో వంతెన పొడవును ప్లెక్సీలు వెలిశాయి.

Total Views: 57 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కేసీఆర్‌, మోడీపై మరోసారి గర్జించిన రాహుల్!

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శనాస్త్రాలు