బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు షాక్!

టీడీపీ ఎం.ఎల్.ఏ బోండా ఉమా చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయో? వివాదాల చుట్టూ బోండా ఉమా తిరుగుతున్నాడో అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. నిన్న దుర్గ గుడిలో అధికారాలు ప్రోటోకాల్ పాటించలేదు అని అలిగి ఆయన వెళ్లిపోయిన సంగతి తెల్సిందే. తాజాగా ఈరోజు బోండా ఉమకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఆరోపణల కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బెజవాడ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఆయనతో పాటు ఆయన భార్య మరో 9మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు వెల్లడించింది.బోండా ఉమ మోసానికి పాల్పడ్డాడంటూ గతంలో రామినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

Total Views: 69 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ