కన్నడ ఫలితాల్లో ఎన్నో సిత్రాలు!

కన్నడ ఎన్నికల్ల ఫలితాల్లో ఎన్నో వింతలూ విచిత్రాలు నెలకొన్నాయి. ఫలితాల్లో ఆశ్చర్యపరిచే అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో మొదటిది అత్యధిక ఓట్లు కాంగ్రెస్ కే పడడం. ఇక్కడ కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు వచ్చాయి. 1,36,93,220 ఓట్లు పడ్డాయి. కానీ సీట్లు మాత్రం 78 దగ్గర ఆగిపోయాయి. అటు బీజేపీకి పడిన ఓట్ల శాతం 36.2 శాతం. వచ్చిన మొత్తం ఓట్లు 1,30,52,584. కానీ బీజేపీ కమలంలో పడిన సీట్లు 104. 1.8 శాతం ఓట్ల తేడా ఈ రెండు పార్టీల మధ్య ఉంది. అయినప్పటికీ తక్కువ ఓట్ల శాతంతో బీజేపీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడం గమనార్హం. అటు జేడీఎస్ కు వచ్చిన ఓట్లు 18.4 శాతం (66,40,258).

బీజేపీ 2013తో పోల్చుకుంటే 64 స్థానాలు పెంచుకుంది. కాంగ్రెస్ 44 స్థానాలు కోల్పోయింది. జేడీఎస్ సైతం 3 స్థానాలు నష్టపోయింది. ఇతరులు గతంలో 22 మంది ఉండగా ఈ సారి ముగ్గురికి పరిమితం అయ్యారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే 2013 నాటి కంటే బీజేపీ 16.3 శాతం ఓట్లను పెంచుకోవడం. 2013లో కమలానికి వచ్చిన ఓట్ల శాతం 19.9. కానీ, తాజాగా 36.2 శాతం ఓట్లకు ఎగబాకడం అధిక సీట్ల కైవసానికి తోడ్పడింది. అటు కాంగ్రెస్ కూడా 2013లో 36.6 శాతం ఓట్లు సాధించగా, తాజాగా 38 శాతానికి పెంచుకుంది. అయినా అధికారానికి దూరమైంది. జేడీఎస్ ఓటు బ్యాంకు 20.2 శాతం నుంచి తాజాగా 18.3 శాతానికి పరిమితమైంది.

Total Views: 104 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కూకట్‌పల్లి బరిలో సుధాకర్ నాయుడు!

ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా