కమెడియన్ సునీల్ కు మరో ఎదురుబెబ్బ!

నటుడు సునీల్.. కమెడియన్ గా స్టార్ క్రేజ్ దక్కించుకున్న నటుడు. తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాక ఫస్ట్ లో కొంచెం పర్వాలేదనిపించుకున్నాడు సునీల్. ఇక తర్వాత డల్ అయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే.. సునీల్ సినిమా ఎప్పుడు వచ్చేది.. ఎప్పుడు వెళ్లేది తెలియని పరిస్థితి వచ్చిందంటే నమ్మక తప్పదు అనే చెప్పాలి. అయితే హీరో సునీల్ తాజాగా నటించిన చిత్రం ఉంగరాల రాంబాబు. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫలితాలు మాత్రం నిరాశ పరచింది. దీంతో ఆయన చాలా డిస్టబ్ అయ్యాడట.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాల తర్వాత సునీల్ తో క్రాంతి మాధవ్ సినిమా అనగానే కాస్త అంచనాలు పెరిగాయి. కాని రిలీజ్ అయిన ఉంగరాల రాంబాబు ఏమాత్రం ప్రేక్షకులకు అలరించలేకపోయింది. అయితే ఈ సినిమా ఎలాగు పోయింది కాని సునీల్ చేయాల్సిన సినిమా కూడా ఈ సినిమా డిజాస్టర్ అవడం వల్ల ఆగిపోయినట్లు తెలుస్తోంది. సునీల్ హీరోగా జెంటిల్మన్ దర్శకుడు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ మూవీ చతురంగ వేట్టై సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. గోపికృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కాని ప్రస్తుతం సునీల్ తో సినిమా తీసి రిస్క్ లో పడటం ఎందుకని ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారట దర్శక నిర్మాతలు. అంతేకాదు చతురంగ వేట్టై సినిమా థ్రిల్లర్ కథాంశంతో సాగుతుంది.

Total Views: 260 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కత్రినాకు మేల్‌ వర్షన్ మహేష్ బాబు!

టాలీవుడ్ లో ఈ జనరేషన్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు