గుంటూరు వైసీపీ ఎంపీ ఖరారు!

ఇప్పటికి వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తిచేసి, రాయలసీమ నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు.ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు వేస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు అత్యంత కీలకమైన స్థానం ఉంది. అతిపెద్ద జిల్లా కావడంతో పాటు రాష్ట్రంలోనే అత్యధిక మునిసిపాలిటీలు కలిగిన జిల్లాగా గుంటూరుకు గుర్తింపు ఉంది. అలాంటి జిల్లాలో గుంటూరు ఎంపీ స్థానం అంటే కూడా చాలా పోటీ ఉంటుం ది. ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన స్థానం. రాయపాటి సాంబశివరావు లాంటి దిగ్గజాలు ఇక్కడ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇటీవల రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నుంచి పోలవరం ప్రాజెక్టులో కొంత కాం ట్రాక్టును నవయుగ సంస్థకు కట్టబెట్టడంతో ఆ యన టీడీపీ సర్కారు మీద కినుకతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి లుకలుకల మధ్య ప్రముఖ విద్యాసంస్థల అధినేత వారసుడైన లావు శ్రీకృష్ణ దేవరాయను వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన నేతలతో పాటు ముఖ్యులతో సమావేశం అయిన సందర్భంగా ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది.

Total Views: 211 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య