పెద్దల సభకు వెళ్లేదెవరో?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ రాజ్యసభ సీజన్ వచ్చేసింది. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, దేవేందర్ గౌడ్, రేణుకా చౌదరిల పదవీకాలం మార్చితో ముగుస్తోంది. ఏపీకి దక్కే మూడు స్థానాల్లో పార్టీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీకి మూడింటిలో రెండు రాజ్యస‌భ స్దానాలు రావ‌డం ఖాయం. ఇక మూడోది ప్రతిపక్షం వైసిపికి దక్కుతుంది. అధికారపార్టీలో రాజ్యసభ కోసం నేతలు లాబీయింగ్‌ మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అధినేత చంద్రబాబు ఇంకా దృష్టి సారించకపోయినప్పటికీ పార్టీ వర్గాల్లో మాత్రం అప్పుడే కుల, మత, సామాజిక, ప్రాంత లెక్కలు మొదలయ్యాయి.

రాజ్యసభకు ఎంపికలో ఎస్సీలకు ప్రాధాన్యం లభించడం లేదనే భావన టీడీపీకి చెందిన ఆ సామాజిక వర్గ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ వర్గానికి చెందిన వారికి రాజ్యసభ టిక్కెట్ ఖాయమంటున్నారు. ఈ కోటాలో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే ప్రతిభా భారతి, వ‌ర్ల రామ‌య్య‌, జూపూడి ప్రభాక‌ర్‌రావు ఆశిస్తున్నారు. ఓసీల నుంచి గట్టీ పోటీనే ఉంది. తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి అవకాశం ఉంటుందని సీఎం రమేష్‌ నమ్మకంతో ఉన్నారు. ఇక మొన్నటివ‌ర‌కు హ‌స్తిన‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన కంభంపాటి రామ్మోహన్ రావుకు తిరిగి కొనసాగింపు ఇవ్వలేదు. దీంతో తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.అభ్యర్ధుల ఎంపిక కంటే కూడా ముందుగా మూడు స్థానాలు దక్కించుకోవడంపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీకి మూడోస్థానం దక్కకుండా చేయాలంటే మరో నాలుగైదుగురు ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్శ్‌ తెరమీదకు వస్తోంది. రాజ్యస‌భ‌కు ఇంకా సమయం ఉన్నందున మూడో స్థానానికి అవసరమైన సంఖ్యాబలం సాధిస్తామని టిడిపి నేత‌లు ధీమాగా ఉన్నారు.

Total Views: 152 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య