భావోద్వేగంతో మీ హరీష్ రావు!

‘వర్షంలో తడుస్తూ, బోనాలతో, బతుకమ్మలతో, మంగళహారతులతో ఇంత అపూర్వమైన స్వాగతం మీరు నాకు ఇచ్చారంటే.. నిజంగా నా జన్మ ధన్యమైంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది.. ఇంత ప్రేమ, ఆదరణ, అభిమానాలతోనే అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుందా’ అని మంత్రి హరీశ్‌ రావు ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. పదవిలో ఉన్నా.. లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా ఈ అభిమానాన్ని, ఆదరణను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ రావు దత్తత గ్రామమైన సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌ తెలంగాణలోనే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. దాంతో, గ్రామంలోని అన్ని ఓట్లూ తమ గ్రామాన్ని తీర్చిదిద్దిన హరీశ్‌ రావుకే వేస్తామంటూ ఇబ్రహీంపూర్‌ గ్రామ ప్రజలు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతకుముందు.. శివారు నుంచి హరీశ్‌రావును అశ్వపు వాహనంపై ఎక్కించి ఊరేగింపుగా తీసుకొచ్చారు.

Total Views: 636 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

దమ్ముంటే పంచాయితీ ఎన్నికలకు పెట్టండి : పవన్ సవాల్!

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన’ కవాతు ముగిసింది.