చంద్రబాబుకు జి.వి.ఎల్ సూటి ప్రశ్నలు!

పార్లమెంటు లో బలం లేని పార్టీలతో టీడీపీ అధినేత చంద్రబాబు జత కూడి బీజేపీ కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం ఎలా చేపట్టగలుగుతారని బీజేపీ ఎంపీ జి వి ఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవాళ కడప నగరానికి విచ్చేసిన ఆయన మీడియా తో మాట్లాడారు. ఆంద్రుల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీతో ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ తో తెలంగాణలో జాతకట్టడం ఏంటని నిలదీశారు. చంద్రబాబు నిన్నటి ధర్మపోరాట దీక్షలో నరేంద్ర మోడీ తో పోల్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగి ఏం అభివృద్ధి సాధించారని నిలదీశారు. బాబు పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంతానికి ఇప్పటీ వరకు ఏ అభివృద్ది చేయలేదని ధ్వజమెత్తారు. సీమ లోని నాలుగు జిల్లాలు నేటి వరకు వెనుకబడిన జిల్లాలలాగే ఉండటం విచారించదగ్గ విషయమని తెలిపారు.

గుజరాత్ రాష్ట్రం కూడా చాలా వెనుకబడిన ప్రాంతమే నని అయితే అక్కడ ప్రతి మారుమూల గ్రామానికి మోడీ ముఖ్యమంత్రి గా పనిచేసిన రోజుల్లో నీళ్ళు ఇచ్చారని గుర్తుచేశారు. పనిచేయడానికి సంకల్పబలం ఉండాలని సూచించారు. అలాకాకుండా చంద్రబాబు మాటలు.. దొంగ దీక్షలతో ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని తెలిపారు. ధర్మపోరాటం ఆయన ఎవరి పై చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ దాన్ని ఇంకోరకంగా జనానికి చెప్పాలని చంద్రబాబు బావించడం సరికాదని హితవు పలికారు. కాగా పేరు ఉత్చరించకుండానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై కూడా నరసింహారావు ధ్వజమెత్తారు.

Total Views: 180 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే