జగన్ పై దాడి కేసు : వైసీపీ నేతకు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాజాగా వైసీపీ నేత జోగి రమేశ్ కు గుంటూరు పోలీసులు ఈ రోజులు నోటీసులు జారీచేశారు. జగన్ పై దాడిని టీడీపీ కార్యకర్తలే చేశారని ఇటీవల వైసీపీ నేత జోగి రమేశ్ ఆరోపించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య గుంటూరులోని అరండల్ పేట పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తమకు సమర్పించాలని కోరారు.

మరోవైపు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నేత జోగి రమేశ్ స్పందించారు. జగన్ పై హత్యాయత్నం కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, విచారణను నీరుగార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా టీడీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై పోరాడుతూనే ఉంటానని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. గత నెలలో వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ జరుపుతోంది.

Total Views: 79 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ