గన్ ది జ’గన్’

jaganలక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ.. దాన్ని చేరుకోడానికి ఎంచుకునే మార్గం కూడా అంతే గొప్పగా ఉండాలి, ప్రతివాది శత్రువు ఎంత పెద్దవాడైనా ఢీకొట్టే ఆత్మవిశ్వాసం ..పోరాడే తత్త్వం ఏ కొద్ది మందికో సొంతం.ఆ కోవలో వైసీపీ అధినేత జగన్ ముందుంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రాజ‌కీయ అనుభ‌వం లేదు.. మొద‌టి సారి ఎమ్మెల్యే .. ఆయ‌న‌కు వీటి మీద అవ‌గాహ‌న లేదు. ఇవి జ‌గ‌న్‌పై అధికార పార్టీ స‌భ్యులు.. మ‌రికొంత‌మంది స‌రిపోను వాళ్లు చేసే ఆరోప‌ణ‌లు. వాటిని ఏకీభ‌వించే వాళ్లు ఉన్నారు.. వ్య‌తిరేకించే వాళ్లూ ఉన్నారు. అయితే అంద‌రూ న‌డిచే దారిలో మాత్రం జ‌గ‌న్ న‌డ‌వ‌డు అనేది ఒక ర‌కంగా వాస్త‌వం. ఎవ‌రైనా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అధికార పార్టీని ఇరుకున పెట్టాల‌ని చూస్తారు. ప్ర‌తిప‌క్షానికి తెలిసిన విష‌యాల‌ను అధికార పార్టీకి తెలియ‌కుండా చూసుకుని అసెంబ్లీలో క‌డిగి పారేయాల‌నుకుంటారు. కానీ జ‌గ‌న్ మాత్రం కొంచెం డిఫ‌రెంట్ “రేపు స‌మాశాల్లో మిమ్మ‌ల్ని క‌డిగి పారేస్తా“ అంటూ ముందుగానే అధికార పార్టీ క్లూ ఇచ్చి మ‌రీ ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. ఒక పార్టీకి నాయ‌కుడుగా ఉన్న వ్య‌క్తి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోతుంటే ఒక‌రిద్దరు పోయినా ప‌ర్వాలేదు. నా వెంట జ‌నం ఉన్నారు.. వాళ్ల‌కు నేనున్నాని ధైర్యంగా చెప్ప‌గ‌లిగే వ్య‌క్తుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తాము చూడ‌లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. జ‌గ‌న్ ఏది చేసినా సూటిగా ఉంటుంద‌ని, దొంగ‌దారి తెలియ‌ద‌ని, అదే ఆయ‌న‌కు కొంత ప్ల‌స్ అయితే కొంత మైన‌స్ అవుతోంద‌ని వారు అభిప్రాయ ప‌డుతున్నారు. జ‌గ‌న్ ట్రెండ్ సెట్ చేస్తారు కానీ.. అది ఫాలో కార‌నేది ముమ్మాటికి వాస్త‌వం అని.. అది అనేక‌సార్లు ఇప్ప‌టికే రుజువైంద‌ని కూడా అంటున్నారు.

అయితే ప్రజాక్షేత్రంలో బలం ఉండటం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దారిలో వినియోగించుకోవడం అంత కన్నా ముఖ్యం.ఈ విషయం జగన్ కి ఇంకా అవగతం కాలేదు.అయన సభలకి వస్తున్న జనానికి ..వైసీపీ లో సభ్యత్వానికి పొంతన ఉండదు.అంటే జనాభిమానాన్ని ఓ క్రమ పద్ధతిలో పెట్టడానికి ఓ ఓటమి తర్వాత కూడా జగన్ దృష్టి పెట్టకపోవడం చూస్తుంటే జగన్ వ్యూహ రచనలో లోపం కనిపిస్తోంది. లక్ష్యం ఎంత గొప్పదైనా, దానిని సాధించేందుకు అనుసరించాల్సిన మార్గం సరిగా లేనప్పుడు అది నిరర్థకమే అవుతుంది.

గన్ ది జ’గన్’
నాన్నగారిని ‘గన్’ గా చేసుకున్నారు. సానుభూతి బుల్లెట్లతో లోడ్ చేసారు. ఎన్నికల నాటికి ట్రిగ్గర్ నొక్కారు. పేలింది కానీ జస్ట్ గురితప్పింది. ఆ తరవాత రుణమాఫీ కరవాలంతో యుద్ధనికి దిగారు. అదికూడా పదును లేకపోవటంతో విరమించుకున్నారు. పట్టి సీమ భూటకమంటూ వార్ చేసారు… ఎవరు పట్టించుకోకపోవడంతో అది కూడా ఒట్టి పోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదానే వజ్రాయుధంగా వాడబోతున్నారు. రాజీనామాల పేరుతో రాజీలేని పోరు చేయబోతున్నాడు. ప్రియతమా నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పాదయాత్రకు సన్నధం అవుతున్నాడు. మరో వైపు పవనుడు కూడా తన గమ్యం మార్చి రణానికి సిద్దమవుతున్నాడు. మరి ఈసారి అయినా సమరం గెలిచేనా? జ’గన్’ పేలేనా?

2019 ఎన్నికల కోసం తన గన్ ని లోడ్ చేసుకుంటున్నారు జగన్. ఈ బుల్లెట్స్ తో టార్గెట్ వైపు గురి పెట్టారు. మరో వైపు పవనుడు అవే బుల్లెట్స్ వాడుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సరి ఆయన జగన్ గురి తప్పకుండ ఉంటుందా? అధికారాన్ని అందిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సి

*అయన పుట్టిన రోజు సందర్భంగా newsdeccan.com శుభాకాంక్షలివే..

Total Views: 1654 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ చేతికి మరో ఆయుధం ఇచ్చిన బాబు..!

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి…