దానం ‘విందు’ రాజకీయం!

పార్టీ మారుతారంటూ ఒకరోజు… లేదు లేదు ఆయనే పార్టీలోనే ఉన్నారంటూ మరో రోజు. గ్రేటర్‌ కాంగ్రెస్‌లో ఎవరినోట విన్నా ఆయన చర్చనే… ఆయనే దానం నాగేందర్‌. పార్టీలో ఒకరోజు హడావుడి చేయడం, మళ్లీ సైలెంట్‌ కావడం దానం స్టైల్‌. అయితే తాజాగా దానం ఇచ్చిన విందు పార్టీలో హీట్‌ పుట్టిస్తోంది. ఇంతకీ దానం విందు రాజకీయాల వెనక మతలబు ఏంటి ? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పుంజుకుంటోంది.. కానీ, గ్రేటర్‌లో మాత్రం స్తబ్ధత నెలకొంది. గ్రేటర్‌ కాంగ్రెస్‌ దిక్కుమొక్కులేని అనాధలా మారింది. గ్రేటర్‌ ఫలితాల తరువాత గ్రేటర్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దానం నాగేందర్‌.. ఆ తరువాత అంటీముట్టనట్లు వ్యవహరించడంతో పార్టీని నైరాశ్యంలోకి నెట్టింది. పార్టీ హైకమాండ్‌ గ్రేటర్‌ విషయంలో ఓ స్పష్టం ఇవ్వకపోవడం… దానంతో ఎవరూ మాట్లాకడపోవడం.. ఇక ఇతర సిటీ నేతలెవరూ పట్టించుకోకపోవడం ఇవన్నీ గ్రేటర్‌ కాంగ్రెస్‌కు స్తబ్ధతకు కారణమయ్యాయి.

తాజాగా దానం నాగేందర్‌ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన విందు.. పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దానం ఉన్నట్లుండి ఇప్పుడు ఇంత పెద్ద దావత్‌ ఎందుకిచ్చినట్లు అని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే దానం కార్యకర్తల వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతున్న కరపత్రం కారణంగానే ఈ విందు ఇచ్చినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. అసలు ఈ కరపత్రంలో ఏముందంటే.. సిటీ నేతలపై కార్యకర్తలు తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా బాగా సంపాదించుకుని ఇప్పుడు హాయిగా పేకాట ఆడుతూ కూర్చున్నారు. ఇప్పటికైనా పని చేయండి లేకుంటే వెళ్లిపోండి.. అంటూ వెలువడిన ఈ కరపత్రం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుందాం.. ఇట్లు రగిలిపోతున్న జంటనగరాల కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటూ కరపత్రాల్లో ప్రచురించారు.ఈ కరపత్రం ఎఫెక్ట్‌తోనే దానం మళ్లీ యాక్టివ్‌ అయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది.

 

Total Views: 113 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే